KL Rahul కి SRH గాలం.. PBKS కి Orange Cap రాంరాం || Oneindia Telugu

2021-10-12 1,090

IPL 2021: SRH could target KL Rahul at mega auction if PBKS release him
#Ipl2021
#Ipl2022megaauction
#Pbks
#Srh
#SunrisersHyderabad
#Punjabkings


ఎప్పటిలానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజ‌న్లో కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌లేక‌పోయిన పంజాబ్ కింగ్స్ టీమ్‌కు భారీ షాక్ తగలనుందా అంటే.. అవుననే సమాధానం వస్తోంది. కెప్టెన్‌గా టీమ్‌కు పెద్ద‌గా విజ‌యాలు అందించలేకపోయినా.. బ్యాటర్‌గా అద్భుతంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ వ‌చ్చే సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడడని ఓ క్రీడా ఛానెల్ పేర్కొంది. ఇదే నిజమయితే కింగ్స్‌కు భారీ షాక్ తగిలినట్టే. ఎందుకంటే.. గత నాలుగు సీజన్లుగా పంజాబ్ తరఫున 600లకు పైగా పరుగులు చేస్తున్న ఏకైక బ్యాటర్‌ రాహుల్ ఒక్కడే. ఈ సీజ‌న్‌లో 13 మ్యాచ్‌ల‌లో రాహుల్ 626 ప‌రుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో అత‌డే టాప్‌లో ఉన్నాడు.